ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామంలో బతుకమ్మ వేడుకలో ఎమ్మెల్యే డాక్టర్ దనసరి అనసూయ(సీతక్క) పాల్గొన్నారు. తన స్వగ్రామమైన జగ్గన్నపేట గ్రామంలో బతుకమ్మ సంబరాలు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. చిన్నప్పటి తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మహిళలతో మమేకమై బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకున్నారు. గ్రామ సర్పంచి నూనేటి సువర్ణ రాణి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. అలాగే ములుగు జిల్లా నగరంలో తొక్కుంట కట్ట వద్ద ఏర్పాటుచేసిన బతుకమ్మ సంబరాల్లో ఆమె పాల్గొన్నారు.