Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సీఎం కేసిఆర్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

జై భారత్ వాయిస్ సంగెం
సంగెం మండలంలోని కుంటపల్లి, సంగెం,ఎల్గూర్ స్టేషన్,తిమ్మాపూర్, షాపూర్,రామచంద్రపురం గ్రామాల్లో ఆయా అధ్యక్షుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది.

ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి సారంగపాణి హాజరై మాట్లాడుతూ సీఎం కెసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్లు,దళితబందు,బీసీ బంధు, కల్యాణలక్ష్మి,షాది ముభారక్, కెసీఆర్ కిట్,గృహలక్ష్మి, మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ వంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని కార్యకర్తలకు సూచించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గ్రామాల్లో చేసిన బీటీ రోడ్లు,సీసీ రోడ్లు వంటి అభివృద్ధిని వివరిస్తూ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ని మూడో సారి లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కార్యకర్తల సమక్షంలో బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు.

ఈ సమావేశాల్లో జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, రైతు బంధు కన్వీనర్ కందగట్ల నరహరి,వైఎస్ ఎంపీపీ బుక్క మల్లయ్య,ప్రధాన కార్యదర్శి జక్క మల్లయ్య,మాజీ ఎంపీపీలు దోనికెల మల్లయ్య,వీరాచారి,కో ఆప్షన్ సభ్యులు మన్సూర్ అలీ,సమన్వయ కమిటీ సభ్యులు,సర్పంచులు, ఎంపీటీసీలు,జిల్లా జాగృతి అధ్యక్షుల యార బాలకృష్ణ,జున్న రాజు,యూత్ అద్యక్షుడు పెండ్లి పురుషోత్తం రెడ్డి,ప్రధాన కార్యదర్శి శంకర్,ప్రచార కార్యదర్శి బందెల రమేష్ బాబు,సోషల్ మీడియా అద్యక్షుడు పోషాల ప్రవీణ్, తోట ప్రభాకర్,చిర్ర రాజు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

తూర్పు కోటలో కొండా దంపతులు మట్టి వినాయకుల పంపిణి

Sambasivarao

కాసం షాపింగ్ మాల్ నిర్మాణం కొరకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలి

కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి