దేశంలో పలు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న వేల పార్టీల మారడం సహజం కానీ కొత్త పార్టీలు ఏర్పాలు చేయాలంటే సహసంతో కుడుకున్న పని మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ కి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ మంత్రి నారాయణ్ త్రిపాఠి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. సొంత పార్టీ ఏర్పాటు చేశారు. ‘వింద్య జనతా పార్టీ’ (VJP) పేరుతో పార్టీని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 25 మంది అభ్యర్థుల జాబితాను సైతం శుక్రవారంనాడు విడుదల చేశారు. మైహర్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి నారాయణ్ రాణే పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వీజేపీ 40 మంది అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్టు మీడియాతో మాట్లాడుతూ త్రిపాఠి చెప్పారు. 25 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశామని, మరో 15 మంది అభ్యర్థుల జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. వింద్య ప్రాంతం మధ్యప్రదేశ్ అభివృద్ధికి చాలా కీలకమని, వింద్య అంశాన్ని ప్రతిసారి తాను లేవనెత్తుతూనే ఉన్నానని చెప్పారు. ఆ మాట తాను ప్రస్తావించినప్పుడుల్లా తనను రెబల్‌గా బీజేపీ చూసేదని, ఆ కారణంగానే తాను వింద్య ప్రాంతం అభివృద్ధి కోసం నడుంబిగించానని చెప్పారు. చివరి నిమిషంలో ఆయన విజేపీ పేరును రిజిస్టర్ చేశారు. వింద్య ప్రాంత ప్రజలు మోసానిక గురవుతున్నారని, వారి అభివృద్ధికి ఏ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆయన ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం గత 20 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ వింద్య ప్రాంతం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తప్పుపట్టారు. ఈ ప్రాంతంలో అనేక వనరులు ఉన్నప్పటికీ ప్రజలకరు ఉద్యోగాల్లేవన్నారు. వింధ్యప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా తమ పార్టీ ఉద్యమిస్తుందని చెప్పారు. వింధ్యప్రదేశ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై బీజేపీ సుముఖంగా లేదని ఆయన చెప్పారు.
కాగా, ప్రత్యేక వింద్యప్రదేశ్ రాష్ట్రం ఆలోచనను త్రిపాఠి కాంగ్రెస్ పార్టీతోనూ పంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలని ఆయన కోరినప్పటికీ కాంగ్రెస్ నిరాకరించినట్టు చెబుతున్నారు. దీంతో త్రిపాఠి సొంత పార్టీని ఏర్పాటు చేయడంతో పాటు పార్టీ అభ్యర్థులను నిలబెట్టేందుకు దారితీసినట్టు తెలుస్తోంది. కాగా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 17న జరుగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి.

next post