నర్సంపేట మండలం బానోజీపేట గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ధి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలను రాజకీయాలకతీతంగా ప్రజల మౌలిక అవసరాలను తీర్చే విధంగా సమగ్రంగా అభివృద్ధి చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో పల్లెలకు రోడ్లను, రైతువేదికను, పల్లె దావఖానాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ప్రతిపక్ష నాయకులు నాలుగు సంవత్సరాలుగా ప్రజలకు దూరంగా ఉండి ఇప్పుడు ఓట్ల కోసం తప్పుడు ప్రచారంతో గ్రామాలను రాజకీయంగా చీలిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ప్రజలు కేసీఆర్ వైపు నిలబడి అభివృద్ధిని కోరుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
previous post