Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

చల్లా ధర్మారెడ్డి వెంటే హౌజ్ బుజుర్గ్ గ్రామస్థుల

జై భారత్ వాయిస్ ఆత్మకూర్
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వెంటే మేముంటామని,తమ స్వార్థ ప్రయోజనాలకోసం కన్నతల్లిలాంటి పార్టీకి మోసం చేసిన వారికి తగిన బుద్దిచెప్పుతామని ఆత్మకూరు మండలం హౌజ్ బూజుర్గ్ గ్రామస్థులు తేల్చిచెప్పారు. ఆదివారం పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డిని వారి నివాసంలో గ్రామస్థులంతా మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం వారు మాట్లాడుతూ… నమ్మిన వ్యక్తిని మోసం చేసి పార్టీ మారిన వ్యక్తులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారు తీసుకున్న దిగజారుడు రాజకీయ నిర్ణయాన్ని గ్రామస్తులు ఎవ్వరు సమర్ధించడం లేదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసిన హౌజ్ బూజుర్గ్ గ్రామస్థులు బిఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి వెంటే ఉంటామన్నారు. నమ్మిన పార్టీకి,నమ్మిన వ్యక్తికీ పదవులు అనుభవించి,మోసం చేసే ద్రోహులను నమ్మే ప్రసేక్తే లేదన్నారు. ఎన్ని కుతంత్రాలు చేసిన ఈ ఎన్నికల్లో చల్లా ధర్మారెడ్డి గెలుపును ఆపలేరని తేల్చిచెప్పారు.తమ గ్రామాన్ని ఏకగ్రీవం చేసి చల్లా ధర్మారెడ్డి గారికి మద్దతుగా నిలుస్తామని తెలిపారు.ఈ ఎమ్మెల్యే ని కలిసిన వారిలో మండల బి.ఆర్.ఎస్.నాయకులు, హౌజ్ బూజుర్గ్ గ్రామ సర్పంచ్,ఉప సర్పంచ్,గ్రామ నాయకులు కార్యకర్తలు,గ్రామస్థులు పాల్గొన్నారు.

Related posts

ఆయుష్మాన్ భవ ఆరోగ్య అవగాహన

హనుమకొండ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన.

హుస్నాబాద్ కాంగ్రెస్ టికెట్ అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి కేటాయించాలి

Jaibharath News