జై భారత్ వాయిస్ దామెర
రాబోవు శాసన సభ ఎన్నికల్లో పరకాల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తిరిగి మూడో సారి విజయం సాధించాలని హనుమకొండ జిల్లా దామెర మండలం ముస్త్యాలపల్లి సర్పంచ్ వడ్డపల్లి శ్రీనివాస్ వినూత్న రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆదివారం తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలంలో సర్పంచ్ వడ్డపల్లి శ్రీనివాస్ తమ కుటుంబ సభ్యులతో పాటుగా ప్రత్యేక పూజాధికాలను జరిపించారు. ఈ క్రమంలో చల్లా ధర్మారెడ్డి విజయం సాధించి మంత్రి పదవి పొందాలంటూ.. 14 కిలో మీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేసి తమ మొక్కులు సమర్పించారు. దీంతో సర్పంచ్ శ్రీనివాస్ తన స్వామి భక్తిని చాటుకున్నాడు.

previous post