Jaibharathvoice.com | Telugu News App In Telangana
జనగామ జిల్లావరంగల్ జిల్లాహన్మకొండ జిల్లా

చైర్స్ పంపిణీ చేసిన ఆర్,ఐ కాలువల శ్రీనివాస్

దేశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్టడీ చైర్స్ పంపిణీ చేసిన ఆర్ఐ కాలువల శ్రీనివాస్ దేశాయిపేటకు చెందిన రెవెన్యూ ఉద్యోగి కాలువల శ్రీనివాస్ ప్రస్తుతం జనగామ ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సొంత ప్రాంతానికి కూడా సేవ చేసే ఆలోచనలో భాగంగా ఉన్నత పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం స్టడీ చైర్స్ పంపిణీ చేస్తున్నట్లు శ్రీనివాస్ తెలియజేశారు. శ్రద్ధ గా చదువుకుని మంచి పౌరులుగా సమాజం లో రాణించాలని చెడు ప్రభావాలను గురి కాకుండా గొప్ప లక్ష్యాలు ఏర్పరుచుకుని వాటిని సాధించుకునేందుకు దుర్వ్యసనాల బారిన పడకుండా తల్లి దండ్రులకు,పాఠశాలకు సొంత ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని తద్వారా సమాజం లో మంచి మార్పులు తీసుకు రావాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి వారి సౌకర్యం కోసం స్టడీ చైర్స్ పంపిణీ చేసినందుకు దాతకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకుడు డా, పాలడుగుల సురేందర్ ,వ్యాయామ ఉపాధ్యాయుడు నిశాంత్ వేణు, జాకీర్ ,పాఠశాల సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

టీటీడీ వద్ద జంక్షన్ ను మంత్రి కొండ సురేఖతో కలిసి ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

బాల్య మిత్రుని కుటుంబానికి ఆర్థిక సాయం

Jaibharath News

ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టమని అందుకే ప్రైవేట్ రంగంలో జాబ్ మేళా