Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఉద్యోగాలు కోల్పోయిన వారికి న్యాయం చేయాలి

ఉద్యోగాలు కోల్పోయిన వారికి న్యాయం చేయాలి
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)

చైల్డ్ హెల్ప్ లైన్ నియామకాల్లో వరంగల్ జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ యంత్రాంగం ఇష్టానుసారం వ్యవహరిస్తూ నియమాకాలలో ప్రభుత్వ ఇచ్చిన గైడ్లైన్స్ లో లేను లేని నిబంధనలు వారి సొంత వారికి లాభం చేకూర్చే విధంగా స్థానిక అనే పేరును ప్రధాన సమస్యగా చూపించి చాలామంది అర్హత ఉన్న గతంలో పనిచేసిన వారికి ఉద్యోగం రాకుండా వరంగల్ జిల్లా స్థానికత అంటూ ఇష్టానుసారంగా ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ కండక్ట్ ను ఉల్లంఘించి నియామకాలను చేపట్టడం జరిగిందని ఆత్మకూరు కు చెందిన జిత్తే మధుసూదన్
పిర్యాదు చేశారు. ప్రధాన ముఖ్య కార్యదర్శి మహిళా శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్ కమిషనర్ గారు ఇచ్చిన చైల్డ్ హెల్ప్ లైన్ నియామకాల లేఖ సంఖ్య :- 959 లో ఎక్కడ కూడా స్థానికత సంబంధించి విషయం గురించి సూచనలు ఆదేశాలు ఆ లేఖలో ఇవ్వలేదని తెలిపారు. కానీ వరంగల్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖధికారులు మాత్రం తమ వాళ్లకు ఉద్యోగాలు రావాలని నోటిఫికేషన్ ఇచ్చిన విధంగా ఇటువంటి నిబంధనలు పాటించకుండా జిల్లా బాలల పరిరక్షణ అధికారి (ఇంఛార్జి) జిల్లా సంక్షేమ అధికారి తమకు సంబంధం అనుకున్న వారికీ ఉద్యోగాలు ఇవ్వాలనే ఉదేశ్యం తో నోటిఫికేషన్లో స్థానికత అని పెట్టి ఎంతో మంది అర్హత ఉన్న వారిని అనర్హతగా అని పక్కనపెట్టినారని ఆరోపించారు . గతంలో తక్కువ జీతాలకు దాదాపు 5,6 సంవత్సరాలు నుండి పనిచేసి చాలా మంది వారి అర్హతను బట్టి తీసుకోవాలని మహిళ శిశు సంక్షేమ శాఖ సంచాలకులు కమిషనర్ ఆ లెటర్ లో పొందుపరిచినారని చెప్పారు . ఆ విషయాన్ని నియామక ప్రక్రియలో పట్టించుకోవడం జరుగగా జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం వదిలేసినారని వివరించారు. ముఖ్యంగా చైల్డ్ హెల్ప్ లైన్ ఉద్యోగాల కోసం చాలామంది గతంలో డిపార్ట్మెంట్లో పని చేసినవారు అర్హత ఉన్నవారు అన్యాయం జరగకుండా జిల్లా కలెక్టర్ స్పందించి అర్హత కోల్పోపోయిన అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారని చెప్పారు.

Related posts

14 నుండి ఆర్ట్స్ కళాశాల డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు!

టీపిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కోకన్వీనర్ గా నత్తి కోర్నెల్

Sambasivarao

చదివింది ఎం.బి.ఏ చేసేది సైబర్‌ నేరాలు