Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు నుంచి మొదలైన కాంగ్రెస్ ప్రచారం

ఆదరిస్తే పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా!
-పరకాల కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి.
-అట్టహాసంగా ప్రారంభమైన రేవూరి ప్రకాశ్ రెడ్డి ఎన్నికల ప్రచారం

-స్వాగతం పలికిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలు*
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);
ఆదరిస్తే పరకాల నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపిస్తానని పరకాల కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు .శుక్రవారం ఆత్మకూరు మండలంలో రేవూరి ఇంటింటా ప్రచారం అట్టహాసంగా మొదలైంది .ముందుగా ప్రకాష్ రెడ్డి కొమ్మాల లక్ష్మి నరసింహ స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మండలంలోని కటాక్షపురం, హౌస్ బుజూ ర్గ్ , నీరుకుల్లా, కందిబండ, పెంచికలపేట, కామారం పెద్దాపూర్ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రేవురికి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు గ్రామాల్లో ప్రజలు స్వాగతం పలికారు. ప్రచారంలో ప్రజలనుద్దేశించి రేవూరి మాట్లాడారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాటిచ్చారు. మాయమాటలతో మోసం చేసే నైజం తనది కాదని , ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తిత్వం తనదన్నారు. పరకాల నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత వహిస్తానని చెప్పారు. మాయమాటల కెసిఆర్ పాలనలో బంగారు తెలంగాణ బూడిద తెలంగాణగా మారిందని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం వంటి హామీలు నెరవేర్చలేదని అన్నారు. అధికార పార్టీ అవినీతి భూతాన్ని తరిమికొట్టాలంటే అందరం సమిష్టిగా సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించాలన్నారు. నిజమైన ప్రజా సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమని, మాయల మరాఠీ కేసీఆర్ ను ఇంటికి సాగనంపడమే ధ్యేయంగా పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ పరకాల నియోజకవర్గం ఇన్చార్జి ఇ నగాల వెంకటరామిరెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ దొమ్మటి సాంబయ్య, టిడిపి మాజీ పరకాల నియోజకవర్గం ఇన్చార్జి గన్నోజు శ్రీనివాస చారి, గీసుకొండ ఎంపీపీ భీమ గాని సౌజన్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్, వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బతుకమ్మ సందడి

రిఫండ్ కోసం తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవు అదనపు డీసీపీ రవి