Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గీసుగొండ మండలంలో బిజెపి అభ్యర్థి ప్రచారం

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ మండలం, విశ్వనాథపురం, కొమ్మాల, సూర్యతండా, నందనాయక్ తండా, మంగళ్ తండా గ్రామాల్లో పరకాల బిజెపి ప్రసాద్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కోలాటాలు, డప్పుచప్పుల నడుమ బిజెపి నేతలకు ఆయా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా అభ్యర్థి కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ బిజెపి డబల్ ఇంజన్ సర్కార్ తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. పరకాల అడ్డా బిజెపి బీసీల అడ్డా నవంబర్ 30వ తేదీన ప్రజలందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర నాయకులు, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంచార్జ్ లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

నేడు మడికొండలో జరిగే జన జాతర సభను జయప్రదం చేయండి

Jaibharath News

ఇల్లంద యంగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు ప్రారంభం

అభిమాని  ఇంటికే ఓ ప్రముఖ హీరో ఎవరూ ఆ హీరో