Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డ్ మెంబర్ తో సహా 60 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక.

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ మండలం శాయంపేట (హవేలీ) గ్రామ బిఆర్ ఎస్ పార్టీ సర్పంచ్ రాజబోయిన రజిత- బిక్షపతి యాదవ్,ఉపసర్పంచ్ గాలి అరుణ-భాస్కర్,వార్డ్ నెంబర్  బోళ్ల ప్రభాకర్,తండా దిలీప్,అల్లం ఆనంద రెడ్డి సముద్రాల రాజేందర్ లతో పాటు 60మంది కుటుంబ సభ్యులు బిఆర్ పార్టీ కీ రాజీనామా చేసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లీ శ్రీనివాస్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల రుద్ర ప్రసాద్,గ్రామ పార్టీ అధ్యక్షులు జుల రమేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు దాజి శివ గార్ల ఆధ్వర్యంలో పరకాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి .రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించిన రేవూరి…ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మగాని రాజు, అల్లం అశోక్,మాసాని ప్రకాష్, కొంగర హరీష్,ఎండి మనారుద్దీన్  తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాయపర్తి యువతలో పరవశించిన దేశభక్తి

సైలెన్సర్లు మార్పు చేస్తే క్రిమినల్ చర్యలు

వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి డిఎం& హెచ్ఓ డాక్టర్ వెంకటరమణ

Sambasivarao