జై భారత్ వాయిస్ దామెర
తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ రాజ్యమేనని పరకాల కాంగ్రెస్ అభ్యర్థి ప్రకాష్
రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో బాగంగా శనివారం సాయంత్రం మండలం ఊరుగొండ, దుర్గంపేట, సీతారాంపురం, దామెర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మన్నెం ప్రకాష్ రెడ్డి అద్వర్యంలో నిర్వహిం చిన ప్రచార కార్యక్రమంలో అభ్యర్ధి రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. తెలంగాణాలో పుట్టబోయే బిడ్డకు కూడా కేసీఆర్ అప్పుల భారం చేసి పెట్టాడని, ప్రజా మోసంతో పాలన చేస్తున్న కేసీఆర కు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని తెలం గాణ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ రాజ్యమేనని దీమా వ్యక్తం చేశారు. అంతే కాకుండా ప్రాజెక్ట్ పేరుతో రూ. వేల కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వృథా చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మన్నెం ప్రకాష్ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు గుడిపాటి శ్రీధర్ రెడ్డి, దొమ్మాటి సాంబయ్య, బీరం సుధాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పోలెపాక శ్రీనివాస్, ఆశోద రాజయ్య, గంగిడి శ్రీధర్ రెడ్డి, సదిరం పోచయ్య, ఉప సర్పంచ్ హింగె నాగేశ్వర్రావు. పుచ్చకాయల లింగారెడ్డి, నల్ల సుదాకర్, జన్ను స్వప్నరాంచందర్. కునమల్ల రవీందర్, రాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.