Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

కేంద్ర బలగాల తో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

కేంద్ర బలగాలతో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):

ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కంపేట, పెద్దాపూర్, కొత్తగట్టు, తదితర గ్రామాల్లో ఆత్మకూరు సిఐ డి రవి రాజు ఆధ్వర్యంలో బిఎస్ఎఫ్ జవాన్లు పోలీసులు ఆదివారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రవిరాజు మాట్లాడుతూ ఈనెల 30వ తేదీన జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు ప్రసాద్ ,రాజేష్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ప్రతి ఒక్కరూ బలవర్ధకమైన పోషకాహారం తీసుకోవాలి

Jaibharath News

బాల్యం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి

Jaibharath News

ఆత్మకూరు లో 144 సెక్షన్ అమలు

Jaibharath News