Jaibharathvoice.com | Telugu News App In Telangana
జాతీయ వార్తలు

నోటుకి ఓటు అమ్ముకుంటే ఐదేళ్ల భవిష్యత్తు అధోగతే!*

జై భారత్ వాయిస్ వరంగల్
ఎన్నికల్లో రాజకీయనాయకులు చూపే డబ్బు ఎరకు ఆశపడితే – మరో ఐదేళ్ల పాటు మోసపోవడం ఖాయమని జైభారత్ జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసి లోక్ నాథ్ అన్నారు.
ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిపోయిన ఇలాంటి వికృత వ్యవస్థ కోసమా గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్ వంటి మహనీయులు జీవితాలు అర్పించింది అని ఆయన ప్రశ్నించారు. ధనిక నాయకులు ఒక్కో నియోజకవర్గంలో గెలుపుకోసం కోట్లకు కోట్లు డబ్బుని ఎరగా వేస్తుంటే, సామాన్యులు పోటీచేసే దిశగా కన్నెత్తి చూసే పరిస్థితి లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.సోమవారం  హన్మకొండ ప్రెస్ క్లబ్ లో జరిగిన  విలేకరుల సమావేశంలో ‘ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి – ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి’ ఓటు అమ్ముకుంటే బ్రతికున్నా శవంతో సమానం పోస్టర్లను జైభారత్ జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసి లోక్ నాథ్, జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి సత్యనారాయణ గోల, జైభారత్  బీసీ పోరాట వేదిక సభ్యులు సాంబశివరావు లతో  కలిసి ఆవిష్కరించారు.జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి సత్యనారాయణ గోల మాట్లాడుతూ ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని ప్రశ్నిస్తూ, నిలువరిస్తూ జైభారత్ గత పదిహేనేళ్లుగా జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ ద్వారా విస్తృతమైన ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తోందని అన్నారు.నోటుకి ఐదేళ్ల భవిష్యత్తుని అమ్మిన మనిషి శవంతో సమానం – నాయకులు పోస్తున్న మద్యానికీ, పడేస్తున్న నోటుకీ ఓటుని అమ్ముకుంటున్నందుకు సిగ్గులేదా అని ఓటర్లని పదునుగా ప్రశ్నిస్తూ లక్షలాది పోస్టర్లద్వారా, ఎన్నికలు జరిగిన ప్రతిచోటా ఓటర్లను జైభారత్ జాగృతం చేస్తుందని అన్నారు.

Related posts

జాతీయ స్థాయి యోగ పోటీలలో పాల్గొన్న తెలంగాణ క్రీడాకారులు

బీజేపీలో చేరిన డాక్టర్ దాస్యం అభినవ్ భాస్కర్

జాతీయస్థాయి ఇన్స్ పైర్ ఎగ్జిబిషన్ కు ఎంపికైన వరంగల్ విద్యార్థి