ఆత్మకూరు మండలంలో 144 సెక్షన్ అమలు – సీఐ రవిరాజు
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)
శాసన సభ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడునున్న సందర్భంగా ఆత్మకూరు మండలంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీఐ రవిరాజు తెలిపారు.ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా మండలంలో 144 సెక్షన్ విధించబడినదని, కావున ర్యాలీలు, డీజే లు గాని, బాణాసంచాలు పేల్చడం, నలుగురు కంటే ఎక్కువమంది గుమిగూడడం నిషేధించబడిందని తెలిపారు. 24 గంటల తర్వాత పర్మిషన్ తీసుకొని సంబరాలు చేసుకోవాలని సీఐ చెప్పారు.