Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

డిసెంబర్ 3న విజయోత్సవ ర్యాలీలు, వేడుకలకు అనుమతి లేదు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

జై భారత్ వాయిస్ హన్మకొండ
డిసెంబర్ 3న రోజున వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, వేడుకలను అనుమతులు లేవని వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం చేశారు.    ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు సంబందించి ఫలితాలు వెలుబడుతున్న వేళ ఎన్నికల నియమ నిబంధనలను అనుసరించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ ఆమలులో ఉన్నందున ఎలాంటి విజయోత్సవ  ర్యాలీలు, వేడుకలను నిర్వహించుకోరాదు. అలానే బాణా సంచా కాల్చడం, డిజే వినియోగం, ద్విచక్ర వాహన ర్యాలీలు, ఇతర ర్యాలీలతో పాటు, సంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, గుంపులు తిరగడం నిషేదించడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలతో పాటు ఓటమి పాలైన పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం సమన్వయంతో వ్యవహరిస్తూ పోలీసులకు పూర్తి సహకారాన్ని అందించాలిసిందిగా  వరంగల్ పోలీస్ కమిషనర్ సూచించారు.ఎవరైనా పోలీసుల నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

Related posts

సీతారాం ఏచూరి మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు

కేంద్ర మంత్రి బండి సంజయిని కలసిన బీజేపీ గీసుగొండ మండల ప్రధాన కార్యదర్శి కొంగర రవి

కొనాయమాకులలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Sambasivarao