Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

1000 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్న కాంగ్రెస్ నాయకులు

జై భారత్ వాయిస్ గీసుకొండ
పరకాల ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిస్తే 1000 కొబ్బరికాయలు కొడుతామని మొక్కును గీసుకొండ మండల కాంగ్రెస్ నాయకులు బసవేశ్వర స్వామి ఆలయంలో మొక్కును చెల్లించుకున్నారు వివరాల్లోకెళ్తే గీసుకొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు తాటికొండ నరేందర్ పరకాల ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి గెలుపొందితే 1000 కొబ్బరికాయలు కొడతామని గీసుకొండ శివాలయంలోని బసవేశ్వర స్వామి వారికి మొక్కుకున్నారు ఈ నెల మూడో తేదీన ఎన్నికల లెక్కింపు లో పరకాల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేవూరి ప్రకాష్ రెడ్డి గెలుపొందడంతో గీసుకొండ మండల కేంద్రంలో సోమవారం నాడు మండల కాంగ్రెస్ నాయకులు వెయ్యి కొబ్బరికాయలు కొట్టి మొక్కు నెరవేర్చుకున్నారు ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు చాడ కొమురారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడేందుకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయబోతుందని ఆయన అన్నారు రేవూరి ప్రకాష్ రెడ్డి గెలుపు పొందుతే గీసుకొండ మండల కాంగ్రెస్ నాయకులు కొబ్బరికాయలు కొడతామని మొక్కును నేడు నెరవేర్చారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గీసుకొండ మండల కాంగ్రెస్ నాయకులు తాటికొండ నరేందర్, జావీద్, బోడకుంట్ల రాజు, వరిగల రాజు, ప్రవీణ్, భరత్, యాదగిరి అశోక్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related posts

సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డ్ మెంబర్ తో సహా 60 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక.

దెబ్బ తిన్న రహదారికి స్వచ్చందంగా మరమత్తు పనులు

Sambasivarao