ఆపదలో ఉన్న మిత్రున్ని ఆదుకోవడమే నిజమైన స్నేహం
(జై భారత్ వాయిస్
ఆత్మకూరు):
ఆపదలో ఉన్న స్నేహితుని ఆదుకోవడమే నిజమైన స్నేహమని ఆత్మకూరుకు చెందిన పూర్వ విద్యార్థులు నిరూపిస్తున్నారు. చిన్ననాటి మిత్రని తల్లి అకాల మరణం చెందగా వారంతా అండగా నిలిచారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన పరికిరాల వాసు తల్లి సౌందర్య ఇటీవల గుండె పోటు తో అకాల మృతి చెందారు. ఇది తెలుసుకున్న మిత్రులందరికీ వాసు ఇంటికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయo అందించారు. మిత్రునికి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో నాగపురి మహేష్ గౌడ్,బయ్య శ్రీధర్,రేవూరి విశ్వాస్ రెడ్డి,మునికుంట్ల సతీష్,రాస మల్ల పరమేశ్వర్,మూల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
previous post
next post