జై భారత్ వాయిస్ వరంగల్
సార్వత్రిక శాసనసభ ఎన్నికలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించినందుకుగాను వరంగల్ జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రావీణ్య ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఉద్యోగుల సహకారంతోనే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, ఈ ఎన్నికలకు సహకరించిన జిల్లా అధికారులకు ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టిఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి గాజె వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సదానందం, సహ అధ్యక్షులు హేమానాయక్ సంయుక్త కార్యదర్శి మధు రామకృష్ణ మెడికల్ ఫోరం అధ్యక్షులు మాడిశెట్టి శ్రీనివాస్, యూనియన్ బాధ్యులు చిరంజీవి, ప్రశాంత్, చందు, మహేందర్, సలావుద్దీన్, నరేష్, కుమార్ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.
previous post
next post