Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

అక్కంపేట ఇక రెవెన్యూ గ్రామం

అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేస్తూ జీవో జారీచేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి,
-ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అక్కంపేట రావడం శుభ సూచకం అనిఇదే స్ఫూర్తితో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా అని అక్కంపేట గ్రామంలో ఎమ్మెల్యేగా తొలి పర్యటనలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వస్థలమైన అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని శుక్రవారం శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రకటించారు.ముందుగా అక్కంపేట గ్రామంలోని ప్రొఫెసర్ జయశంకర్, అంబేద్కర్ గార్ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా ప్రకటిస్తూ ఇచ్చిన జీవో కాపీని గ్రామస్తులకు అందజేశారు.ఈ సందర్భంగా రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గతంలో రచ్చబండ కార్యక్రమంలో అక్కంపేట గ్రామానికి వచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి స్వగ్రామం రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రాంతంగా ఉండడం చూసి మేము అధికారంలోకి రాగానే అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేసి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారని ఇటీవల పరకాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తాను కూడా అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామం చేయాలని కోరడం జరిగినదని అన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించగానే తాను అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామం చేయాలని సీఎం కు గుర్తు చేయడం జరిగిందని అన్నారు .సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి జీవో జారీ చేయడం జరిగిందని అన్నారు.ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు అన్నారు.ఇది స్ఫూర్తితో రాబోయే రోజుల్లో పరకాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తానని ప్రొఫెసర్ జయశంకర్ ఆశీస్సులు ఉండాలని రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.

Related posts

దళిత బంధు నిధులు తక్షణమే విడుదల చేయాలి

అభివృద్ది లో సర్పంచ్ కు యువత తో చేయూత నిస్తాం

Jaibharath News

ఆత్మకూరు సీఐగా క్రాంతికుమార్ బాధ్యతల స్వీకరణ

Jaibharath News