జై భారత్ వాయిస్
ఆత్మకూరు);
మాజీ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోశనివారం. ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆత్మకూరు కొత్త బస్టాండ్ వద్ద ముందుగా బాణసంచాను కాల్చి జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, సోనియా గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. సందర్భంగా పలువు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన
సోనియమ్మకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇచ్చి రుణం తీర్చుకున్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని
అన్నారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం, రు. 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్, ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి రాజు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బీరం సుధాకర్ రెడ్డి, ఆత్మకూర్ పిఎసిఎస్ చైర్మన్ ఎరుకొండ రవీందర్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ ముద్ధం సాంబయ్య, బిసి సంక్షేమ సంఘం నాయకులు భయ తిరుపతి, మాజీ సర్పంచ్ నాగెల్లి సామెల్, ఏ సి ఎస్ కే డైరెక్టర్ రేవూరి జయపాల్ రెడ్డి, యూత్ నాయకులు తనుగుల సందీప్ మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
previous post