Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

రోడ్ల పై ధాన్యం ఆరబొస్తే కఠిన చర్యలు … సి ఐ రవిరాజు

రోడ్డు మీద ధాన్యం ఆరబోయడం వల్ల ప్రమాదాలు.
ఆరబోస్తే కఠిన చర్యలు….
-సీఐ రవిరాజు

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ):రోడ్డు మీద ధాన్యం ఆరబోయడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతారని అని ఆత్మకూరు సిఐ రవి రాజ్ అన్నారు. మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మకూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల రైతులు వరి, మొక్క జొన్న పంటల కోతలు మొదలయ్యాయని అన్నారు. కావున రోడ్డుపై రైతులు వరి ధాన్యంమక్కలు ఆరబోయ కూడదని రైతులకు ఆత్మకూరు సిఐ సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో, కల్లాల వద్ద ధాన్యం అరబెట్టుకోవలన్నారు. పంటలను రోడ్డుపై ఆర పెట్టడంతో గతంలో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారని చెప్పారు. రైతులు పండించిన పంటలను రోడ్డుపై ఆరబెట్టవద్దని, ప్రత్యేక కల్లాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ సమాచారాన్ని ప్రతీ గ్రామంలో సర్పంచులు చాటింపు వేసి రైతులకు అవగహన కల్పించాలని కోరారు. కాదని రోడ్డుపై ధాన్యాన్ని ఆరబోస్తే జరిగే ఘటనలకు రైతులే బాధ్యులు అవుతారని ఆయన వివరించారు. రోడ్ల పై ధాన్యం ఆరబోయడం వల్ల ప్రమాదాలు జరిగితే రైతులపై కేసు నమోదు అవుతాయని హెచ్చరించారు.

Related posts

ఆగష్టు 31 వరకు అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ పీ.జీ కోర్సుల్లో ప్రవేశ గడువు! జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు

బిఆర్ఎస్ పార్టీకి యువనేత  ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా  త్వరలో బిజెపి లోకి

మీ కుటుంబ భవిష్యత్తు కోసం మద్యం సేవించి వాహనం నడపొద్దు వరంగల్‌ ట్రాఫిక్‌ ఏసిపి సత్యనారయణ