జైభారత్ వాయిస్ భాగ్యనగర్
రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ని వరంగల్ జిల్లా టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి, శాలువా పులబోకెలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఉద్యోగులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా వ్యవహరించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందే విధంగా కృషి చేయాలన్నారు.టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రభుత్వానికి అండగా ఉంటారని అదేవిధంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి ని కోరారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి గాజె వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సహదానందం, సహాధ్యక్షులు హేమా నాయక్, ఉపాధ్యక్షులు గద్దల రాజు, జిల్లా బాధ్యులు శంకేశి రాజేష్, నాగేశ్వరరావు, ఇంద్రసేనారెడ్డి, కిషన్, శ్యామ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

next post