పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
-సర్పంచ్ పర్వతగిరి రాజు
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని ఆత్మకూరు మేజర్ గ్రామ సర్పంచ్ పర్వతగిరి రాజు అన్నారు. గురువారం మా సోషల్ యాక్టివిటీస్ సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణం పరిరక్షణ, ప్లాస్టిక్ నివారణ అంశం పైన గ్రామపంచాయతీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజు మాట్లాడుతూ పర్యావరణానికి ప్లాస్టిక్ వ్యర్ధ పదార్థాలతో ముప్పు వాటిని వాతావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు. దీనివల్ల మానవాళికి అనేక అనర్ధాలుజరుగుతున్నాయని, అలాగే భవిష్యత్ తరాలకు పెను ముప్పు వాటిల్లె ప్రమాదం ఉందన్నారు. అనంతరం మా సోషల్ సర్వీసెస్ జనరల్ సెక్రెటరీ నాగ బండి శివప్రసాద్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతి ఒక్కరు పూర్తిగా నిషేధించాలని వాటి స్థానంలో కాటన్ బ్యాగులను పేపర్ కప్పులను వినియోగించాలని ఆయన సూచించారు. ప్లాస్టిక్ నివారణలో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మేడ యాదగిరి, వార్డు సభ్యులు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.
previous post