మహిళలు ఆర్థిక స్వాలంబన దిశగా ప్రయాణించాలి.
-కెనరా బ్యాంక్ మేనేజర్ మదిన్ సిద్ధిక్
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
మహిళలు కుట్టు శిక్షణ పూర్తిచేసుకుని ఆర్థిక స్వాలంబన దిశగా పయనించాలని ఆత్మకూరు కెనరా బ్యాంక్ మేనేజర్, మదిన్ సిద్ధిక్ అన్నారు. శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలో ఎఫ్ఎం ఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన కుట్టు శిక్షణ ముగింపు శిబిరానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన పలువురు మహిళలకు ఆయన చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సిద్ధిక్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. అలాగే కెనరా బ్యాంకు తరపున శిక్షణ పొందిన మహిళలకి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కుట్టు శిక్షణ పొందిన మహిళలు ఆర్థికంగా నిలదొక్కోవాలన్నారు. అనంతరం మాజీ జెడ్పిటిసి టింగిలికారి సత్యనారాయణ మాట్లాడుతూ మహిళా సాధికారతకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల సేవలు మరువలేని వన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మేడ యాదగిరి, ఎఫ్ ఎం ఎం సాంఘిక సేవా సంస్థ కోఆర్డినేటర్ బత్తుల కరుణ, ఎర్ర శ్రీకాంత్, మా సోషల్ సర్వీస్ ఆక్టివిటీ కార్యదర్శి నాగబండి శివప్రసాద్, శిక్షకురాలు మాధవి, రూపాదేవి తదితరులు పాల్గొన్నారు.