మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికిన ఎంపిపి
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా మొదటిసారిగా బాధ్యతలను స్వీకరించి ములుగు నియోజకవర్గం వస్తున్న సీతక్కకు ఆత్మకూరు ఎంపీపీ మార్క సుమలత రజనీకర్ గౌడ్ ఆత్మకూరు మండలం హౌస్ బుజ్జూర్గ వద్ద ఆదివారం ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ దంపతులు సీతక్కను శాలవతో ఘనంగా సన్మానించారు. అనంతరం కటక్షపూర్ పెద్ద చెరువు సమస్యలపైన వినతి పత్రాన్ని అందజేశారు. జాతీయ రహదారి పైన కటాక్ష పూర్ మత్తడి ఉందని దానిపైన హై లెవెల్ వంతెన నిర్మించాలని మంత్రి సీతక్క ను కోరారు. ఈ మేరకు స్పందించిన మంత్రి సీతక్క ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

previous post
next post