పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క చే గణిత పుస్తకావిష్కరణ :
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)
ములుగు జిల్లా శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా లోని పత్తిపల్లి ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయులు సుతారి మురళీధర్ రూపొందించిన హైలైట్స్ అఫ్ హై స్కూల్ మాథమాటిక్స్ “అనే పుస్తకాన్ని పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా విద్యాధికారి పాణిని, ఎం ఈ ఓ సుదర్శన్ రెడ్డి, పత్తిపల్లి హెచ్ యం ప్రేమలత, ఉపాధ్యాయులు రాజు, పల్లె వెంకట శ్రీనివాస్, జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సైన్స్, గణిత ఉపాధ్యాయులు అధికసంఖ్యలో పాల్గొని ఉపాధ్యాయులు మురళీధర్ కు పలువురు అభినందనలు తెలిపారు. సంఖ్యాభావన, అల్జెబ్రా, అర్థమాటిక్, జియోమెట్రీ, మెనసురేషన్, డాటా హ్యాండిలింగ్,
ట్రి గోనామెట్రీ మొదలైన అధ్యాయాలు 6 నుండి 10 వ తరగతి వరకు విద్యార్థులకు ఈ పుస్తకం చక్కగా ఉపయోగపడుతుందని అని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహిత కందాల రామయ్య తెలిపారు.
previous post