అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ
జాతర వేలం పాటలు
(జై భారత్ వాయిస్
ఆత్మకూరు) : ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతర వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు జాతర కార్యనిర్వహణ అధికారి శేషగిరి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 21న నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరలో బెల్లం కొబ్బరికాయల అమ్ముకునే హక్కు వేలం పాటకు లక్ష రూపాయల ధరవతూ చెల్లించి వేలంపాటలో పాల్గొనవచ్చునన్నారు. అలాగే కొబ్బరి ముక్కలు పోగు చేసుకునేందుకు రు.50వేల ధరావత్ తో, పుట్టు వెంట్రుకలు పోగు చేసుకునేందుకు లక్ష రూపాయల ధరావతు,అలాగే పులిహోర లడ్డు అమ్ముకునేందుకు రు.50 వేలు ,సైకిల్ స్టాండ్ కు రు. 20 వేలు, పేలాలు పుట్నాలు అమ్ముకునేందుకు రు. 10 వేలు , ధరావత్తో ఈనెల 22వ తేదీ శుక్రవారం రోజున బహిరంగ వేలం పాటల్లో పాల్గొనవచ్చునన్నారు. టెండర్ దక్కించుకునేందుకు నిబంధనలకు నిబంధనలకు లోబడి వరంగల్ స్టేషన్ రోడ్ లోని ఆకారపు గుడి ఆవరణలో జరుగు వేలంపాటలకు హాజరు కావాల్సిందిగా కోరారు.