ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);
ఆత్మకూరు మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆరుట్ల మాధవమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులు వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని తరించారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి అధ్యక్షులు టింగిలికారు సత్యనారాయణ, మునికుంట్ల సతీష్ ,పోలు రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కేశవపురం శ్రీ వేంకటేశ్వర ఆలయం లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దైవదర్శ నానికి
నీరుకుళ్ల, పెంచికలపేట, కేశవపురం గ్రామాల ప్రజలు ఉత్తర ద్వార దర్శనానికి తరలి వచ్చారు.
