Jaibharathvoice.com | Telugu News App In Telangana
గుంటూరు

క్రిస్మస్‌ పర్వదినం క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ సిఎం వైయస్‌ జగన్‌  శుభాకాంక్షలు

జై భారత్ వాయిస్ విజయవాడ
క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దైవ కుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు
ఏసుప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయమని, తన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని ముఖ్యమంత్రి అన్నారు. ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలకు ఉండాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.

Related posts

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: ఐజీ త్రిపాఠి

Jaibharath News

పసుపుచీర కట్టుకున్న వారంతా ఎంఅవుతారో తెలుసా