May 11, 2025
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ సమ న్యాయం: మంత్రి కొండా సురేఖ

జై భారత్ వాయిస్ వరంగల్
తెలంగాణ నూతన  కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ సమ న్యాయం చేయడమే లక్ష్యమని, అందులో భాగంగానే ఈనెల 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర పర్యావరణ,అటవీ  దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని అబ్నుస్  హాల్లో మంత్రి కొండా సురేఖ రెండు కోట్ల 78 లక్షల 38 వేల రూపాయల షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు లబ్దిదారులకు  పంపిణీ చేశారు. గత ప్రభుత్వం లాగా పార్టీ కార్యకర్తలకే అభివృద్ధి సంక్షేమ ఫలాలు దక్కుతాయన్న ఆలోచన అవసరం లేదని అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు దక్కుతాయని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని, వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని, ప్రతి ఇంట్లో సభ్యురాలిగా ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని సురేఖ అన్నారు.  ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు మాజీ కార్పోరుటర్ కేడల పద్మజనార్థన్ రెవ్యెన్యూ సిబ్బంది  లబ్దిదారులు పాల్గోన్నారు.

Related posts

గీసుకొండలో‌ మహిళ అంత్యక్రియలకు ఆర్ధిక సహాయం.

గీసుగొండ గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య పనులు

వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం

Notifications preferences