– ప్రతి నిరుపేదకు సంక్షేమ పథకాలు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం
– జిల్లా ఎంపీటీసీల పురం అధ్యక్షులు కమలాపురం రమేష్
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) ;
తెలంగాణలోని నిరుపేద
ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందించి ఆదుకుంటుందని జిల్లా ఎంపీటీసీల పోరం అధ్యక్షులు కమలాపురం రమేష్ అన్నారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలో రాష్ట్ర ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత పర్వతగిరి రాజు ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండాను గ్రామ పార్టీ అధ్యక్షులు బయ్య కుమారస్వామి ఎగురవేశారు. ప్రజలందరికీ పండ్లు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. పెద్దాపురం గ్రామంలో జిల్లా ఎంపీటీసీల పోరం అధ్యక్షులు కమలాపురం రమేష్ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కక్కర్ల రాధిక రాజు గౌడ్ పాల్గొన్నారు. హౌస్ బుజ్జూర్గు గ్రామంలో ఎంపీపీ మార్క సుమలత రజనీకర్ గౌడ్ జెండాను ఎగురవేశారు. మండలం లోని గ్రామాలలో గ్రామ పార్టీ అధ్యక్షులుకాంగ్రెస్ పార్టీ జెండాలను ఎగురావేశారు.
మండల యూత్ ప్రధాన కార్యదర్శి తనుగుల సందీప్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఏరుకొండ రవీందర్, మత్స్య శాఖ చైర్మన్ బయ్య తిరుపతి , సర్పంచ్ కంచ రవికుమార్, కాంగ్రెస్ జిల్లా నాయకులు ఎండి కాజా, రేవూరి జైపాల్ రెడ్డి, పరికరాల వాసు, వార్డ్ మెంబర్ కాడబోయిన రవి యాదవ్, అబ్బారబోయిన. అనిల్ తదితరులు పాల్గొన్నారు