April 7, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో ప్రజా పాలన కార్యక్రమం

ఆత్మకూరు లో ప్రజా పాలనలో కార్యక్రమం
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా అభయ హస్తం పథకాల కోసం శనివారం ఆత్మకూరు మండల కేంద్రంతో పాటు నీరుకుళ్ల గ్రామంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆత్మకూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పర్వతగిరి రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పథకంలో భాగంగా ప్రజల నుండి అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. లబ్ధిదారులు కంగారు పడకుండా జనవరి 6వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ప్రజా సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది అన్నారు. గ్రామంలో 20 కౌంటర్లను ఏర్పాటు చేసి లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, తహాసిల్దార్ సురేష్ కుమార్ సర్పంచ్ ఆర్షం బలరాం డిప్యూటీ తహసిల్దార్ సంగీత, మండల పంచాయతీ అధికారి చేతన్ కుమార్ రెడ్డి, పి ఆర్ ఏ ఈ లత, గ్రామ పంచాయతీ కార్యదర్శి మేడ యాదగిరి , ఏవో యాదగిరి,ఏఈఓ సౌమ్య, ఎస్సై ప్రసాద్, అంగన్ వాడి ఆశ కార్యకర్తలు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి

ప్రజాపాలనా. ప్రతీకార పాలన

ఆత్మకూరు ఎస్ ఐ సస్పెన్షన్ నిలిపి వేయాలి

Jaibharath News