Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

రైస్ మిల్లర్లు బియ్యానికి సంబంధించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలి

జైభారత్ వాయిస్ హనుమకొండ : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన గడువులోగా రైస్ మిల్లర్లు బియ్యానికి సంబంధించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీ అన్నారు.మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశపు హాలులో జిల్లా నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారికి అందజేయాల్సిన బియ్యంపై పౌర సరఫరాల శాఖ అధికారులు, జిల్లాలోని రైస్ మిలర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ పాల్గొని మాట్లాడుతూ ఖరీఫ్ లో వచ్చిన ధాన్యం నుండి రావాల్సిన బియ్యం పలు మిల్లుల నుండి ఇంకా పెండింగ్ లో ఉందని అన్నారు. పెండింగ్ లో ఉన్న రైస్ మిల్లుల యజమాన్యం గడువులోగా ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ఈ నెల 31వ తేదీలోగా ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎస్ఓ వసంతలక్ష్మి, డి ఎం మహేందర్, సివిల్ సప్లై డ్యూటీలు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు

Related posts

తల్లుల ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలి -జాతరలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

Jaibharath News

అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు

Jaibharath News

Kaloji కాకతీయుల కళల కాణాచికి మరో మణిహారం.కాళోజీ కళాక్షేత్రం ప్రారంభనికి శుభమూహూర్తం