కటాక్షపురం లో ప్రజా పాలనపై గ్రామసభ
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామంలో ప్రజా పాలన అభయహస్తం పై గ్రామసభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక ఎంపీపీ మార్క సుమలత రజనీకర్ పాల్గొని ప్రభుత్వం అందించే ఈ గ్యారెంటీ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని,అందరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మచ్చిక యాదగిరి గౌడ్, తహసిల్దార్ సురేష్ కుమార్, ఎం.పి.ఓ చేతన్ కుమార్ రెడ్డి ,అగ్రికల్చర్ ఏఈఓ మానస, ఐసిడిఎస్ సూపర్వైజర్ నషిమా, సి సి సాంబరెడ్డి, ఉపసర్పంచ్ ఓన్నాల సాంబయ్య, పంచాయతీ కార్యదర్శి సృజన,వార్డు సభ్యులు కుడుతల రమేష్, ఓన్నాల బిక్షపతి, మారుపల్లి సూర్య కుమారి, ఐరబోయిన లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు