మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)
ఆత్మకూరు మండల అక్కంపేట గ్రామానికి చెందిన మాజీ మండల బి అర్ ఎస్ అధ్యక్షుడు ఎనకతాళ్ల రవీందర్ తండ్రి ఎన్కతాళ్ల మొగిలయ్య ఇటీవల మృతి చెందగా బుధవారం పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి మొగిలయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అదేవిధంగా ఆత్మకూరు మండల కేంద్రంలో కొద్దిరోజుల క్రితం మృతి చెందిన మందల మల్లారెడ్డి కుటుంబాన్ని ధర్మారెడ్డి పరామర్శించారు.మాజీ ఎమ్మెల్యే వెంట పరామర్శించిన వారిలో ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.