Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మాజీ మంత్రి కడియం ఆరు నెలలు కాదు ప్రభుత్వం గ్యారెంటిగా ఐదు ఎళ్ళు ఉంటాము పరకాల ఎమ్మేల్యే రేవూరి.

జై భారత్ వాయిస్ సంగెం
అధికార దాహంతో కాంగ్రెస్ పార్టీ ఆరునెలలో పడిపోతుందని ఇటివల మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారని కాని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో ప్రభుత్వ పరిపాలన గ్యారెంటిగా ఐదు ఎళ్ళు ఉంటుందని పరకాల ఎమ్మేల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.ప్రజలే పాలకులని ప్రజల నిర్ణయమే తుది నిర్ణయమని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చెందుకే ప్రజా పాలన కార్యక్రమం అని ఇది ప్రజా ప్రభుత్వం అని దొరల ప్రభుత్వం కాదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.
సంగెం మండలం లోని కాట్రపల్లి, చింతలపల్లి గ్రామాలలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఆయా గ్రామాలలో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ లను ఎమ్మెల్యే సందర్శించి లబ్ధిదారులకు దరఖాస్తులు అందజేస్తున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుదారుల వద్దకు స్యయంగా వెళ్లి ఎమ్మెల్యే పరిశీలించారు.అనంతరం.ఎమ్మెల్యే గా గెలిసి మొదటి సారిగా గ్రామాలకు వచ్చిన రేవూరి ప్రకాశ్ రెడ్డి ని ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికి ప్రజా పుష్ప గుచ్చాలు అందించి శాలువాలు కప్పి సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం కాంగ్రెస్ పార్టీ చేసిందని ఎన్నికల ముందు ఆరు గ్యారంటీల పై సంతకం చేసిన హామీతో ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడిగామని మాపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు .ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆరు గ్యారెంటీల అమలే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమని మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలతో పాటు రేషన్ కార్డులు ఇతర అవసరాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని ఎవరు ఎటువంటి అపోహలకు గురి కావద్దని అన్నారు16కోట్ల మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం గత పాలకుల అసమర్థ పాలన వల్ల నేడు 7లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మారిందందని అన్నారుఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను 100 రోజులలో నెరవేర్చేందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే 6గ్యారంటీలకు చట్టబద్దత కల్పించిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వానిదే నని అన్నారు. ఆర్థిక స్థితిని వాస్తవ పరిస్థితిని ప్రజలముందు పెట్టాలనే నిండు శాసన సభలో శ్వేత పత్రం విడుదల చేయడం జరిగినదని అన్నారు. అయినప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంగా అంచలంచెలుగా నెరవేరుస్తుందని ప్రజా ప్రతినిధులు అధికారులు కలిసి పని చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమని అన్నారు.ప్రజా పాలన కార్యక్రమంలో అభయహస్తం గ్యారెంటీ ల పథకాలకు స్వీకరిస్తున్న దరఖాస్తుల పూరింపుపై ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగించాలని, సమస్యలను నివృత్తి చేస్తూ దరఖాస్తు స్వీకరణ చేపట్టాలని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవుూరి ప్రకాశ్ రెడ్డి అధికారులకు సూచించారు దరఖాస్తు స్వీకరణ పై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేస్తూ ప్రతి ఒక్కరు వద్ద దరఖాస్తు స్వీకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కందకట్ల కళవతి జడ్పీటిసి గూడ సుదర్శన్ రెడ్డి మండల తహశీల్దార్ ఎంపిడిఓ వివిధ గ్రామాల సర్పంచ్ లు అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

విదేశాలకు వెళ్ళేందుకు చోరీలకు పాల్పడతున్న దొంగ అరెస్టు

గీసుకొండ హైస్కూల్ లో ఘనంగా SSC 2007-08 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

కేంద్ర మంత్రి బండి సంజయిని కలసిన బీజేపీ గీసుగొండ మండల ప్రధాన కార్యదర్శి కొంగర రవి