Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

6 గ్యారంటీలు బైబిల్ ఖురాన్ భగవద్గీతతో సమానంమంత్రి కొండా సురేఖ

జై భారత్ వాయిస్ వరంగల్
. 6 గ్యారంటీలు  కాంగ్రెస్ పార్టీ అధినేత్రిసోనియా గాంధీతో ప్రకటించామంటే ఆ గ్యారెంటీలు తమకు బైబిల్ ఖురాన్ భగవద్గీతలతో సమానమని వాటిని కచ్చితంగా అమలు చేసి తీరుతామని రాష్ట్ర పర్యావరణ అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని పరిశీలించేందుకు దేశాయిపేట 12వ డివిజన్ వచ్చిన సురేఖ ముందుగా బొడ్రాయిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దేశాయిపేట షాదీ ఖానా లో జరుగుతున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని పరిశీలించి ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. వరంగల్ నగరంలోని 36వ డివిజన్ భుపేష్  నగర్, శివనగర్  కమ్యూనిటీ హల్ లో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో మంత్రిపాల్గోన్నారు.40వ డివిజన్ , ఉర్సు కరిమాబాద్ సి ఆర్ సి భవన్ ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి  కొండ సురేఖ ఈ సందర్భంగా మాట్లాడుతూ 9 సంవత్సరాలు ఏకచిత్రాధిపత్యంగా అధికారం చేపట్టిన బిఆర్ఎస్ పార్టీ నాయకులకు అధికారం పోయేసరికి మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు
రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారం చేపట్టగానే చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం సెక్రటేరియట్లో ఏర్పాటు చేయడంతో లక్షలాదిమంది ఫిర్యాదారులు ఇబ్బందులను చూసి ప్రతి ఊళ్లో ప్రతి గ్రామం  వార్డులో ప్రజా పాలన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు రూపంలో స్వీకరిస్తున్నారని అవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేసి తీరుతుందని ఎవరు కూడా అపోహ చెందాల్సి అవసరం లేదని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కట్టుబడి ఉందని ప్రజలు ఎవరు అధైర్య పడద్దని సురేఖ అన్నారుఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ నేతలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Related posts

పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

*కామారెడ్డి డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలి.. చాపర్తి కుమార్ గాడ్గే

Sambasivarao

శ్రీరామకృష్ణ మోడల్ స్కూల్ లో శ్రీకృష్ణ జన్మష్టామి వేడుకలు