Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

దర్మారం లో కంది పంటక్షేత్రదినోత్సవం

జై భారత్ వాయిస్ గీసుకొండ
వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం కేంద్ర ప్రభుత్వ  అఖిలభారత సమన్యయ పరిశోధన పథకం-కంది,  పంటలో గీసుకొండ మండలం ధర్మారంకు   వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రైతులకి కంది పంట పై  లింగమూర్తి కంది క్షేత్రంలో శిక్షణ కార్యక్రమము క్షేత్రదినోత్సవం శనివారం ఉదయం పదకొండు గంటలకు  నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య ఆథిగా  వరంగల్  ఏరువాక కేంద్రం  కో-ఆర్డినేటర్  ఇన్చార్డ్ ఎ.డి.ఆర్. డాక్టర్  దిలిప్ కుమార్  మాట్లాడుతూ కంది పంట సాగు ,  గణనీయ విస్తీర్ణంలో సాగు పెంచుకోవల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైన ఉందని అన్నారు.వివిధ రకాల పంటల సరళిలో అపరాల సాగు చేయడం వలన పంటలు పెరుగుతు  పంట మంచి దిగుబడులు రైతులు పోందాలపి   సూచించారు.  అపరాల విభాగాని చెందిన   డాక్టర్   సంధ్యా కిషోర్   మాట్లాడుతూ వరంగల్ వ్యవసాయ పరిశొధూ స్థానం నుండి మెలైన వంగడాలు  W.R.G.E-97, WRGE-93, WRG-255 రకాలు ఎండుతెగులును తట్టుకుంటాయని తెలిపారు.  రైతులు   పెద్ద మొత్త సాగిు చేయాలని సూచించారు. అగ్రనామి శాస్తవేత్త  ఎఫ్ఎల్ డి ఇన్ చార్జీ  డాక్టర్ మధు మాట్లాడుతూ    కంది పంట కోత, కోతానంతరం తీసుకోవల్సిన  జాగ్రత్తలు తెలిపారు. శాస్త్రవేత్త డాక్టర్ వీరన్న  మాట్లాడతూ  కందిపటలో కాయ ఈగ   లక్షణాలు    నివారణ పద్ధతుల గురించి తెలిపారు ఈ శిక్షణ కార్యక్రమంలో గొదాశి లింగమూర్తి ,సంజీవ, రామస్వామి కిషన్ తోపాటు  ధర్మారం ,అనంతారంరైతుసోదరులు తదితరులు  పాల్గొన్నారు. .

Related posts

బీసీ డిమాండ్ల సాధనకై హైదరాబాద్ హోటల్ సెంట్రల్ కోర్టులో అఖిలపక్ష సమావేశం

సీఎం కేసిఆర్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

Jaibharath News

శ్రీ వేణుగోపాల స్వామి సహిత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో పరకాల శాసన సభ్యులు ప్రకాశ్ రెడ్డి