Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

శంభునిపేట – గణేష్ నగర్ లో అయోధ్య శ్రీ రాముల వారి అక్షింతల వితరణ

జై భారత్ వాయిస్ రంగశాయిపేట
వరంగల్ మహానగరంలోని గణేష్ నగర్ కాలనీ వాసులు కుటుంబ సమేతంగా.. సాంప్రదాయ వేషధారణలో కాషాయ జెండాలు చేతబట్టిశంభునిపేట కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం నుండి శ్రీ రాముల వారి పవిత్ర అక్షింతల కలశాలను తలపై దాల్చి, కోలాటాలు, నృత్యాలతో శోభాయాత్రగా కాలనీ లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయానికి తీసుకువచ్చి పూజలు జరిపారు ప్రసాద వితరణ అనంతరం కాలనీ పెద్దలు 12 బృందాలుగా ఏర్పడి, రామ నామ సంకీర్తన, భజనలు చేస్తూ..ఇంటింటికి వెళ్లి రాములవారి అక్షింతల తో పాటు శ్రీరాముని ఫోటో, ఆహ్వాన పత్రం అందజేశారు.కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు  గుగులోత్ విజయ్, చిన్నాల రాధాకిషన్, గోల్కొండ సదానందం, అలువాల సారంగపాణి, రంజిత్, మడూరి సోమయ్య, సుతారి రాజు, బండారి రవిబాబు, గంటా వేణు గోపాల్,  కొక్కొండ భాస్కర్, పరికిపండ్ల రాజేశ్వర్, సదానందం, ఊరుగొండ చిరంజీవి, కోటి,  రవీందర్,  గణేష్, రాకేష్, స్వామి   అధిక సంఖ్యలో మహిళలు, యువతీయువకులు, పిల్లలు ఉత్సాహంగా తదితరులు పాల్గొన్నారు.

Related posts

గంగదేవిపల్లిలో పర్యావరణ పరిరక్షణకుసామూహిక అగ్నిహోత్రం

మనుగొండ నాగయ్య పల్లె ప్రధాన రహదారి వరద నీటికి కోతకు గురి*

Sambasivarao

విద్యార్థుల నడవడిక మీద కాలేజీ యాజమాన్యం పర్యవేక్షణ వుండాలి