Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి*

జై భారత్ వాయిస్ సంగెం
సంగెం మండలంలో పోచమ్మ తండా, వి ఆర్ యన్ తండా గ్రామ పంచాయతీలలో వికసిత భారత్ సంకల్ప్ యాత్ర ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమము.యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా నోడల్ ఆఫీసర్,సంగెం మేనేజర్ యాక అనిల్ ఆద్వర్యంలో పోచమ్మ తండా గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచ్ గూగులోత్ రమాదేవి రవీందర్,వి ఆర్ యన్ తండా గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచ్ గుగులోత్ బుచ్చా నాయక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంగెం శాఖ ఫీల్డ్ ఆఫీసర్ గోవింద్ చౌహన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలనిప్రజా సంక్షేమ పథకాలను సమాజంలో అట్టడుగు స్థాయికి తీసుకెళ్లందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర,రాష్ట్రాలు ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలపై అవగాహన ప్రజల భాగస్వామ్యం పెంపొందించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వం వికసిత భారత్ సంకల్ప్ యాత్ర”ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమము* అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా
నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల పాల్గొని ఆ శాఖలకు ప్రజలకు అందిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు గురించి ఆస్మాన్ భారత్, అబ్బా కార్డు, టీబీ, జన్ ఆయుష్ మందుల షాపులు, రైతులకు క్రాప్ లోన్లు, బంగారం లోను ఖాతాదారులు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ప్రధానమంత్రి జీవనజ్యోతి యోజన పథకం, ప్రధానమంత్రి జీవన్ సురక్ష యోజన పథకం ,ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన పెన్షన్ పథకం, సుకన్య యోజన పథకాలు తప్పనిసరిగా చేసుకోవాలని వారు కోరారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వివరించే నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కమ్యూనిటీ కో ఆర్డినేటర్ బొజ్జ సురేశ్, ఆరోగ్యశాఖ ఏఎన్ఎం మేర్సమ్మ, టీవీ సూపర్వైజర్ రంజిత్, ఆస్మాన్ భారత్ మిత్ర బండి శ్రీనివాస్, ఆశా కార్యకర్త సుమలత, పోస్ట్ మ్యాన్ గోపతి రాజమౌళి, వివోఏలు గూగులోత్ రజిత,గూగులోత్ అనిత, సి ఎఫ్ ఎల్ కౌన్సిలర్ శ్రీకాంత్, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ సాయి, కరోబార్లు,గ్రామ సంఘం అధ్యక్షులు అరుణ, సైది, మహిళా సంఘాలు మహిళలు, వృద్ధులు, యువతి, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మహిళ సంరక్షణ  రక్షణ కోసం ప్రభుత్వం కార్యక్రమాలు ఉపయోగించు కొవాలి

గీసుకొండ మండలంలో 144 సెక్షన్‌ అమలు గీసుగొండ సిఐ. రామకృష్ణ

Jaibharath News

మొండ్రాయి రైతుబిడ్డ యూపీఎస్సీ లో గెజిటెడ్ అధికారిగా ఎంపిక