Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

8 నుంచి ఊరుగొండ ‌‌లక్ష్మీనర్సింహస్వామి కళ్యాణోత్సవాలు,జాతర

జై భారత్ వాయిస్ దామెర, హన్మకొండ జిల్లా దామెర మండలం ఊరు గొండ గ్రామంలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి అధ్యయన కళ్యాణోత్సవాలను ఈ నెల 8 నుంచి నిర్వహించనున్నట్లు శ్రీలక్ష్మీ నర్సింహస్వామి దేవాలయ ప్రధానార్చకులు తూపురాణి శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఈనెల 8 నుంచి 19 వరకు 12 రోజులపాటు నిర్వహించనున్న అధ్యయన కళ్యాణోత్సవాల వివరాలను ఆయన వెల్లడించారు. 8న సోమవారం ఉద యం 8 గంటలకు ప్రాబోధికం, సాయంత్రం తొళక్కం, 9న మంగళవారం ఉదయం ప్రాబోధికం, సాయం త్రం పరమపద ఉత్సవం, 10న బుధవారం ఉదయం నూతుందాది చాత్మర, అంకురార్పణ, ధ్వజారోహణం, సాయంత్రం హోమం, బలిహరణం దేవతా ఆహ్వానం, 11న గురువారం ఉదయం ప్రాబోధికం, హోమం, బలిహరణం, సాయంత్రం ఎదురుకోళ్లు, కల్యాణమ హోత్సవం, 12న శుక్రవారం ఉదయం ప్రాబోధికం, బిందెతీర్థం, సాయంత్రం హోమం, బలిహరణం, 13న శనివారం ఉదయం ప్రాబోధికం, బిందెతీర్థం, సాయంత్రం హోమం, బలిహరణం, సదస్యం, 14న ఆదివారం ఉదయం బిందెతీర్థం, పూర్ణాహుతి, ధ్వజపట, ఉద్వాసనం, 15న సోమవారం స్వామి వారుగుట్టపైకి పోవుట, బండ్లుతిరుగుట, 16న మంగళవారం జాతర, మహాన్నదానం, 17న బుధవారం స్వామివారు గ్రామంలోకి వచ్చుట, 18న గురువారం ఉదయం ప్రాబోధికం, సాయంత్రం 4గంటలకు గంపవారి కోనేరులో చక్రతీర్థం, రాత్రి నాగబలి, శ్రీపుష్ప యాగం,19న శుక్రవారం దుర్గంపేటలో శావవంటి తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రధానా ర్చకులు తూపురాణి శ్రీనివాసాచార్యులు తెలిపారు.ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఊరుగొండలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో స్వామి వారి కళ్యాణ అధ్యయన ఉత్సవాలకు నిర్వాహకులు ముస్తాబు చేశారు. గత కొన్నేళ్లుగా ఊరుగొండ గ్రామానికి చెందిన గొంది నర్సింహారెడ్డి తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం కళ్యాణోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఊరుగొండలోని ప్రధాన దేవస్థానంతో పాటు గ్రామ సమీపంలోని గుట్ట వద్ద ఉన్న దేవాలయానికి రంగులు వేయడం వంటి పనులను పూర్తి చేశారు. మండలంతో పాటు ఆత్మకూరు, శాయంపేట, పరకాల, నడికూడ తదితర మండలాలే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుప్రాంతాల నుంచి భక్తులు వచ్చి, స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటారు .భక్తులసౌకర్యార్థం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Related posts

అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఆత్మకూరు -సిఐ క్రాంతి కుమార్

Jaibharath News

ప్రతి ఒక్కరూ బలవర్ధకమైన పోషకాహారం తీసుకోవాలి

Jaibharath News

ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు కాజీపేట దర్గా ఉరుసు ఉత్సవాలు