(జై భారత్ వాయిస్ వరంగల్ )స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గీసుకొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సీఐ రామకృష్ణ వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సిఐ రామకృష్ణ మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతిని దేశంలో యువజన దినోత్సవంగా జరుపుకుంటారని యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. స్వామి వివేకానంద రామకృష్ణ మఠాన్ని స్థాపించి యువతను సన్మార్గంలో నడిపించేందుకు అనేక బోధనలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎస్సై సుధీర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
previous post