Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గృహలక్ష్మి లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటా మాజీ ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి

( జై భారత్ వాయిస్ వరంగల్ )
పేదవాడి సొంతింటి కల నెరవెర్చడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని, ఈ పథకాన్ని కొనసాగించాలని లేదంటే ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తే అందులో గృహలక్ష్మి లబ్ధిదారులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గృహలక్ష్మి లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉండి వారి పక్షాన పోరాడతానని తెలిపారు. పరకాల నియోజకవర్గంలో గృహలక్ష్మి పథకంలో 3000 (హనుమకొండ జిల్లా.1605, వరంగల్ జిల్లా.1395) మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.ఇప్పటికే ఇండ్ల నిర్మాణం కూడా చెప్పటడం జరిగిందని పేర్కొన్నారు. ఇండ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని లబ్ధిదారుల పక్షాన హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం అందచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో లబ్ధిదారుల పక్షాన కోర్టును ఆశ్రయించడం జరిగిందని తెలుపారు.కోర్టు నుండి సానుకూలంగా స్పందన వచ్చిందని, పేదవారు గత ప్రభుత్వం అందించిన గృహలక్ష్మి పథకంలో ఇండ్లు నిర్మాణం చేపడితే మీరు రద్దు చేస్తే ఎలా అని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని తెలిపారు. వెంటనే గృహాలక్ష్మి పథకంలో పరకాల నియోజకవర్గంలో 3000 మంది లబ్ధిదారుల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టిన సుమారు 500 మందికి వెంటనే బిల్లు చెల్లించాలని,అదేవిధంగా మిగతా లబ్ధిదారులను కూడా పునః పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు కోర్టు ఆదేశించిందని వారు తెలిపారు.ఏది ఏమైనా గృహలక్ష్మి లబ్ధిదారులకు పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటానని చల్లా ధర్మారెడ్డి గారు తెలిపారు.

Related posts

చెన్నారావుపేట ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన రాకేష్ రెడ్డిని అభినందించిన ఆర్.ఎం.పి పి.ఎం.పి డాక్టర్లు

Sambasivarao

కాంగ్రెస్ నాయకులు అల్లం. బాల కిషోర్ రెడ్డి సహకారంతో ఉచిత వైద్య శిబిరం

Jaibharath News

ఘనంగా మహమ్మద్ ప్రవర్త జన్మదిన వేడుకలు