జైభారత్ వాయిస్ హన్మకొండ
హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శుక్రవారం వివేకానందుని 161 వ జయంతి కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బన్న ఐలయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా వివేకానందుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జీవితములో ధనం కోల్పోతే, కొంతే కోల్పోయినట్లు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లేనని మనకు బోధించిన భారతీయ తత్వవేత్త వివేకానందుడని ఆయన అన్నారు. నేడు దేశంలో యువత లక్ష్యం లేకుండా ముందుకు సాగుతుందని లక్ష్యం లేని యువత భారతదేశానికి చేటు అని ఆయన అన్నారు యువత దుర్వ్యసనాలకు బానిస కాకుండా కాపాడవలసిన బాధ్యత భారతీయులందరిపై ఉన్నదని యువతే దేశానికి ముఖ్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య హనుమంతు మాట్లాడుతూ వివేకానందుడు ఎన్నో కష్టనష్టాలను అనుభవించి దేశ పురోగవృద్దికి ఏమి చేయాలని ఆలోచన చేశాడని బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్వావలంబనతోనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని గ్రహించాడు అని తెలిపారు వారి ఆర్థిక స్వావలంబన కోసమే ఆయన చికాగో వెళ్లి ధనార్జన కూడా చేసి భారతదేశ బడుగు బలహీన వర్గాలకు పంచిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మంద శ్రీనివాస్. డాక్టర్ సురేష్, డాక్టర్ రాజు, శేషు, డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్. రాంబాబు, కళాశాల పిఆర్ఓ డాక్టర్ ఆదిరెడ్డి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

previous post
next post