April 8, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

సమ్మక్క జాతర పనులను వేగవంతం చేయాలి -ఎమ్మేల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
ఆత్మకూరు మండలం లోని అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర కు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూడాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.మంగళవారం పరకాల నియోజకవర్గం గీసుకొండ మండలంలో పలు కార్యక్రమాలలో పాల్గొని మనుగొండ నుండి నాగయ్య పల్లి మీదుగా మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తూ రోడ్డును పరిశీలిస్తూ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అగ్రంపహాడ్ కు చేరుకున్నారుఅనంతరం అగ్రంపహాడ్ లోని సమ్మక్క సారలమ్మ గద్దెల చుట్టూ ఫినిషింగ్ ను పరిశీలించారు . పనులు వేగవంతం చేయాలని అన్నారు. గద్దెల సమీపంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని, రోడ్లు ఇతర మౌలిక వసతులు వెంటనే చేపట్టాలని ప్రభుత్వం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకొని త్వరగా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Related posts

ఆత్మకూరులో సీఎం కప్ టార్చ్ ర్యాలీ విజయవంతం.

పోలీస్ సేవలు అభినందనీయం

ఎ. జ్యోతి

ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు కాజీపేట దర్గా ఉరుసు ఉత్సవాలు