ఆర్టీసీ బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీ
డీజిల్ ట్యాంకర్ బోల్తా…
బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి స్వల్ప గాయాలు…
వాటర్ ట్యాంకర్ తో మంటలు చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకున్న సిఐ రవిరాజు…
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు )
ఆర్టీసీ బస్సు డీజిల్ ట్యాంకర్ ఎదురెదురుగా ఢీకొన్న సంఘటన ఆత్మకూరు మండలం నీరుకుల్ల క్రాస్ రోడ్ వంతెన వద్ద శుక్రవారం జరిగింది. స్థానిక సీఐ రవిరాజు తెలిపిన వివరాల ప్రకారం ములుగు నుండి హనుమకొండ కు వస్తున్న ఆర్టీసీ వరంగల్ రెండవ డిపోకు చెందిన టీఎస్ 03 జెడ్ 0308 బస్సును , హనుమకొండ నుండి ములుగు వైపు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ ఏపీ 16 టిడి 8611 వాహనము ను డ్రైవర్ రామంచ ప్రశాంత్ నిర్లక్ష్యంతో అతివేగంగా నడుపుకుంటూ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు .దీంతో ఆర్టీసీ డ్రైవర్ ముందు అద్దం పూర్తిగా ధ్వంసం అయింది, బస్సులో ప్రయాణిస్తున్న పదిమందికి స్వల్ప గాయాలు అయ్యాయని వారిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించమన్నారు, కాగా డీజిల్ ట్యాంకర్ అతివేగంగా ఉండడం చేత రోడ్డు పక్కన బొల్తా పడింది. అందులో పూర్తి డిజల్ తో నింపబడి ఉంది. విషయం తెలిసిన వెంటనే హుటా హుటిన సంఘటన స్థలాన్ని చేరుకొన్నామని అన్నారు .తన సిబ్బందితో వాటర్ ట్యాంకర్ తీసుకొని వెళ్లి మంటలు చెలరేగకుండా, ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఆర్టీసీ బస్ కండక్టర్ దొడ్డ సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవిరాజు తెలిపారు.