Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సఖి సేవలపై విధ్యార్థులకు అవగాహన కార్యక్రమం :

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలంలోని ధర్మారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం పిల్లలపై జరుగుతున్న వేధింపులు, సైబర్ నేరాలు వాటి ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుందో వాటికి గల పరిష్కారం మార్గాలను ఫోక్స్ ఆక్ట్, బాల్యవివాహ నిరోధక చట్టం గురించి విద్యార్థులకు అవగాహన సఖి కేంద్ర నిర్వహూలు కల్పించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య , ఎస్ఎంసి మెంబెర్ శ్రీకాంత్ .సఖి కౌన్సిలర్ నూర్జాన్ , లీగల్ అడ్వకేట్ శోభా రాణి పాఠశాల ఉపాధ్యాయులు, సఖి సిబ్బంది పాల్గొన్నారు.

  • సఖి కౌన్సిలర్స్ నూర్జహాన్ శోభారాణి , మాట్లాడుతూ సమాజంలో మహిళలు మరియు బాలికలు అనేక రకాల వేధింపులకు గురి అవుతున్నారని, సైబర్ నేరాలు వాటి వలన ఎదుర్కొనే వేధింపులు వాటికి గల పరిష్కార మార్గాలను పిల్లలకు అవగాహన కల్పించారు. వేధింపులు ఎదుర్కొనేబాలికలకు, మహిళకు సహాయం, రక్షణ అందించుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సఖి కేంద్రాలను తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఏర్పాటు చేసారు. అని ఇది మహిళ శిశు సంక్షేమా ఆధ్వర్యంలో నిర్వహించ బడుతుంది అన్నారు , అలాగే మహిళా హెల్ప్ లైన్ 181, చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ 1098,0870- 3571832 కి కాల్ చెయ్యాలి అని వెంటనే సహాయం అందుతుంది అని తెలిపారు

Related posts

గీసుకొండలో గ్రామపంచాయతీలో చాకలి ఐలమ్మ 129 వ జయంతి ఉత్సవాలు

Sambasivarao

మోడల్  స్కూల్ ప్రిన్సిపాల్ కు   సన్మానం

1000 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్న కాంగ్రెస్ నాయకులు

Jaibharath News