సాయిబాబా విగ్రహానికి పంచలోహ తొడుగు
4.16 లక్షల రూపాయలతో ఆలయ, విగ్రహాల అలంకరణ
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ): ఆత్మకూరు మండల కేంద్రంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో శనివారం 4.16 లక్షలతో సాయిబాబా విగ్రహానికి, గణపతి, దత్తాత్రేయ స్వామి విగ్రహాలకు పంచలోహ తొడుగులు ఏర్పాటుచేసి సుందరంగా అలంకరించారు. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన దాత లంకా సుధాకర్ సౌజన్యంతో ఆలయ వెలివేషన్ పుట్టి, ఆలయానికి రంగులు విగ్రహాలకు పంచలోహ తొడుగులు ఏర్పాటు చేశారు.శనివారం లంక సుధాకర్ లంకా రవి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు అయినవోలు నాగరాజు శర్మ బాబాకు అర్చనలు అభిషేకాలు నిర్వహించి భక్తుల కు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు జున్నుతుల ఆదిరెడ్డి, బూర సతీష్, రేవూరి సంజీవరెడ్డి, కరివేద మహేందర్ రెడ్డి, సముద్రాల విజేందర్, త దితరులు పాల్గొన్నారు.
previous post
next post