సాధన ద్వారా నే సాధ్యం అంటున్న సాధన సూరులు
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
ఆత్మకూరు మండల కేంద్రంలో సాధన సూరుల విన్యాసాలు గ్రామస్తులను అకట్టుకున్నాయి. ఆదివారం జెడ్ పి ఎస్ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఆత్మకూర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సాధన సూరులు చింతకింది శంకర్, సమ్మయ్య, గజ్జి వెంకటేశ్వర్లు, చింతకింది శోభన్లు చేసిన విన్యాసాలు గ్రామస్తులను అలరించాయి. మాయలు మంత్రాలు కనికట్టులు లేవని సాధన ద్వారానే సాధ్యమని చింతకింది శంకర్ తెలిపారు రాళ్లతో దేవుళ్ళ తయారీ, జొన్నకట్టెల పైన వ్యక్తి ఊరేగింపు, తలపై మంటతో పూరీలు కలవడం వంటి విన్యాసాలతో ప్రజలను మై మారిపించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు వెల్దే వెంకటేశ్వర్లు యూత్ అధ్యక్షులు మార్త రంజిత్, కుల పెద్దలు చిందం నరేందర్, వెంగళ దాస్ వెంకన్నకు, పాపని, వడ్డేపల్లి రవితదితరులు పాల్గొన్నారు.
previous post